Laxman Kumar Adluri: దివ్యాంగులకు 5 శాతం ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Dec 04 , 2025 | 05:12 AM
దివ్యాంగులకు 5% ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. రేకుర్తిలోని...
మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ వెల్లడి
కరీంనగర్, డిసెంబరు 3(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): దివ్యాంగులకు 5ు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ తెలిపారు. రేకుర్తిలోని బధిరుల ఆశ్రమ పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించిందని, దివ్యాంగులైన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని అన్ని బధిరుల ఆశ్రమ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు.