Tragedy: వేడి సాంబారులో పడి బాలుడి మృతి
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:21 AM
పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు వేడి సాంబారు పాత్రలో పడి మృతిచెందాడు....
పెద్దపల్లి జిల్లా మల్లాపూర్‌లో ఘటన
ధర్మారం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): పుట్టినరోజు జరుపుకోవాల్సిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు వేడి సాంబారు పాత్రలో పడి మృతిచెందాడు. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. మల్లాపూర్ గురుకుల పాఠశాల-కళాశాల (బాలికలు)లో మంచిర్యాల జిల్లా కోటపల్లి గ్రామానికి చెందిన మొగిలి మధుకర్ దంపతులు వంట మనుషులుగా పని చేస్తున్నారు. ఆదివారం మధుకర్ వంట చేస్తున్న క్రమంలో పక్కనే ఆడుకుంటున్న కుమారుడు మోక్షిత్ (4) ప్రమాదవశాత్తు వేడి సాంబారు పాత్రలో పడిపోయాడు. తీవ్ర గాయాల పాలైన మోక్షిత్‌ను కుటుంబసభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం నాడు మృతి చెందాడు. సోమవారమే మోక్షిత్ పుట్టిన రోజు కాగా, అదే రోజు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.