Telangana Government: 47 మంది ఏఈవోలకు పదోన్నతులు
ABN , Publish Date - Sep 29 , 2025 | 04:01 AM
రాష్ట్రవ్యాప్తంగా 47 మంది వ్యవసాయ విస్తరాణాధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది...
హైదరాబాద్, సెప్టెంబరు 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 47 మంది వ్యవసాయ విస్తరాణాధికారులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. మల్టీ జోన్-1 పరిధిలో 29 మంది ఏఈవోలు, మల్టీ జోన్-2 పరిధిలో 18 మంది ఏఈవోలకు ఏవోలుగా పదోన్నతి కల్పించారు. ఏడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ఈ సమస్యపై రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డైరెక్టర్ డాక్టర్ గోపి ప్రత్యేక చొరవ తీసుకొని పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయించారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ఏఈవోల సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.