42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
ABN , Publish Date - Nov 16 , 2025 | 11:36 PM
బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని పలువురు బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
- కల్వకుర్తిలో బీసీ రిజర్వేషన్ సాధన దీక్షలో నాయకులు
కల్వకుర్తి, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి) : బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని పలువురు బీసీ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని తహ సీల్దార్ కార్యాలయం ముందు బీసీ రిజర్వేషన్ సాధన దీక్ష నిర్వహించారు. చట్టం ప్రకారం 42 శాతం రిజర్వేషన్ల అమలు ప్రజా ఉద్యమాల ద్వారానే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా పలువురు నాయకులు పేర్కొన్నారు. అదేవిధం గా కల్వకుర్తి పట్టణంలోని కల్వకుర్తి బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రన్ ఫర్ సోషల్ జస్టీస్ నిర్వహిం చారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ ఠాకూర్ బాలాజీసింగ్, కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్‌కుమార్, బీసీ జాక్ కన్వీ నర్ కొమ్ము శ్రీనివాస్‌యాదవ్, జిల్లా ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు జిల్లెల రాములు, బీసీ జాక్ నాయకులు సదానందంగౌడ్, రాజేంద ర్, కునుగుల జంగయ్య పాల్గొన్నారు.
సంఘటితంగా ఉద్యమిద్దాం
పెద్దకొత్తపల్లి, (ఆంధ్రజ్యోతి) : 42శాతం బీసీ రిజర్వేషన్లు కోసం సంఘటితంగా పోరాడుదామని జేఏసీ చైర్మన్ గట్టు ఆంజనేయు లు, వైస్ చైర్మన్లు లాయర్ వెంకట స్వామి, గుజ్జుల పరమేశ్ పిలుపు నిచ్చారు. ఆదివారం మండలంలో ని సాతాపూర్ గ్రామంలో బీసీలు సమావేశమయ్యారు. జేఏసీ గ్రామకమిటీ ఏర్పా టైంది. సాంఘికంగా, సామాజికంగా రాజకీ యంగా 42శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించే దశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. కొత్తపేట సింగిల్ విండో చైర్మ న్ కట్ట రాజేందర్‌గౌడ్, జేఏసీ ప్రధాన కార్యదర్శి బద్దుల ప్రవీణ్, కోశాధికారి గడ్డికోపుల శివప్రసా ద్, మాజీ ప్రధానోపాధ్యా యులు ఆనందజ్యోతి, బయికాడి నాగేంద్రం తదితరులు పాల్గొన్నారు.
హక్కులు సాధించుకుందాం
ఊర్కొండ, (ఆంధ్రజ్యోతి)ః బీసీల హక్కులు సాధించుకుందామని మాజీ సర్పంచ్, బీసీ జేఏసీ మండల నాయకులు మ్యాకల శ్రీనివాసు లు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని తన నివాసంలో బీసీ ముఖ్య నాయకులతో స మావేశం ఏర్పాటు చేసి కార్యాచరణ ప్రకటించా రు. ఆయన మాట్లాడుతూ వచ్చే స్థానిక ఎన్ని కల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధించడా నికి ప్రతీ ఒక్కరు ముందుకు రావాల్సిన అ వస రం ఉందని అన్నారు. ఎన్నికల హామీగా బీసీ రిజర్వేషన్లు మిగిలిపోవద్దని, పార్టీలు పక్కన పెట్టి అందరము ఐకమత్యంగా మనమెంతో.. మనకంతా అనే నినాదంతో సాగుదామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో బీసీ నాయకు లు నాగరాజు, ఆంజనేయులు, శ్రీనివాస్ తది తరులు ఉన్నారు.