Share News

42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి

ABN , Publish Date - Aug 07 , 2025 | 12:18 AM

కేంద్రం బీసీలకు 42శాతం రిజర్వే షన్లను అమలు చేయాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. ర

42శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి
ఢిల్లీలో చేపట్టిన నిరసనలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి

వలిగొండ, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): కేంద్రం బీసీలకు 42శాతం రిజర్వే షన్లను అమలు చేయాలని ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌చేస్తూ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ఢిల్లీలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. రిజర్వేష న్లను అమలు చేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నూతి రమేష్‌రాజు, కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య, బత్తిని సహాదేవ్‌, లింగయ్య, సతీష్‌, మల్లేశం, బాలరాజు, భాస్కర్‌, పాల్గొన్నారు.

బీబీనగర్‌: ఢిల్లీలో బీసీ రిజర్వేషన్‌కు చట్టబద్దత కల్పించాలని కోరుతూ రాష్ట్ర కాంగ్రెస్‌ చేపట్టిన ధర్నాకు బీబీనగర్‌ మండలానికి చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు తరలి వెళ్లారు. ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి జంతర్‌ మంతర్‌ ధర్నాలో పాల్గొన్నారు. కార్యక్రమంలో నాయకులు పంజాల రామాంజనేయులుగౌడ్‌, గోళి పింగల్‌రెడ్డి, గడ్డం బాలకృష్ణగౌడ్‌, గోళి నరేందర్‌రెడ్డి, గడ్డం బాల్‌రెడ్డి, సత్తిరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - Aug 07 , 2025 | 12:18 AM