Maoists Surrender: 41 మంది మావోయిస్టుల లొంగుబాటు
ABN , Publish Date - Nov 27 , 2025 | 04:20 AM
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ ఎదుట బుధవారం 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరందరిపై సుమారు...
8 వారిపై రూ.కోటి 19 లక్షల రివార్డు
చర్ల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి) : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఎస్పీ జితేందర్ యాదవ్ ఎదుట బుధవారం 41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరందరిపై సుమారు రూ.కోటి 19 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. లొంగిపోయిన మావోయిస్టుల్లో 39 మంది సౌత్ సబ్‌జోనల్ బ్యూరో సభ్యులని వారిలో మరో ఇద్దరు దండకారణ్య స్పెషల్‌జోన్ కమిటీ, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారన్నారు. లొంగిపోయిన వారికి వారిపై ఉన్న రివార్డులను అందజేస్తామన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని, ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి 528 మంది మావోయిస్టులను అరెస్టు చేశామని, 560 మంది లొంగిపోయారని, 144 మంది ఎన్‌కౌంటర్లలో మృతి చెందారని ఎస్పీ వెల్లడించారు.