kumaram bheem asifabad- జిల్లాలో 32.4 మిల్లీమీటర్ల వర్షం
ABN , Publish Date - Sep 14 , 2025 | 11:11 PM
కుమరంభీం ఆసిపాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 32.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చింతలమానేపల్లిలో 88.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కౌటాలలో 63.4, వాంకిడిలో 49.2, ఆసిఫాబాద్‌లో 44.8, బెజ్జూర్‌లో 31.4, సిర్పూర్(యూ)లో 26.4 దహెగాంలో 25.4, సిర్పూర్(టి)లో 25.2 రెబ్బెనలో 23.0, కెరమెరిలో 22.4, పెంచికల్‌పేటలో 22.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లింగాపూర్, తిర్యాణి మండలాల్లో 20.8, కాగజ్‌నగర్‌లో 16.0, జైనూరులో 7.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
ఆసిఫాబాద్, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కుమరంభీం ఆసిపాబాద్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 32.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చింతలమానేపల్లిలో 88.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. కౌటాలలో 63.4, వాంకిడిలో 49.2, ఆసిఫాబాద్‌లో 44.8, బెజ్జూర్‌లో 31.4, సిర్పూర్(యూ)లో 26.4 దహెగాంలో 25.4, సిర్పూర్(టి)లో 25.2 రెబ్బెనలో 23.0, కెరమెరిలో 22.4, పెంచికల్‌పేటలో 22.0 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లింగాపూర్, తిర్యాణి మండలాల్లో 20.8, కాగజ్‌నగర్‌లో 16.0, జైనూరులో 7.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాతో పాటు ఎగువ మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్‌గంగ ప్రమాద స్థాయిలో వంతెనను తాకుతూ ప్రవహిస్తుండటంతో అటువైపు రాకపోకలు నిలిచిపోయాయి. బెజ్జూరు మండలంలో లోలెవల్ వంతెనలు ఉప్పొంగి ప్రవహించడంతో ఆయా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కుమరంభీం ప్రాజెక్టులోకి 3,091 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరడంతో రెండు గేట్లు ఎత్తి 2,088 క్యూసెక్కుల వరదనీటిని అధికారులు కిందికి వదిలారు. దీంతో పెద్దవాగు పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.
ఉప్పాంగిన వాగు.. నిలిచిన రాకపోకలు
బెజ్జూరు, సెప్టెంబరు 14(ఆంధ్రజ్యోతి): బెజ్జూరు మండలంలో ఆదివారం ఉదయం కురిసిన వర్షానికి కృష్ణపల్లి-సోమిని గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ వంతెన ఉప్పొంగి ప్రవహించడంతో మధ్యాహ్నం వరకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలో హైలెవల్ వంతెనలు లేని కారణంగా ఏటా వర్షకాలంలో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.
ఉప్పొంగి ప్రవహిస్తున్న పెన్‌గంగ
సిర్పూర్(టి), సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): ఎగువన మహరాష్ట్రలో కురుస్తున్న బారీ వర్షాలకు ఆదివారం సిర్పూర్(టి) మండలంలోని వెంకట్‌రావుపేట పొడ్స గ్రామాల మధ్య ఉన్న పెన్‌గంగ ప్రమాదకర స్థాయిలో వంతెనను అనుకొని ఉప్పొంగి ప్రవహిసోంది. అలాగే పెన్‌గంగా ఉప్పాంగి ప్రవహిస్తుండటంతో బ్యాక్ వాటర్‌తో సిర్పూర్(టి)-హుడ్కిలి గ్రామాల మధ్య ఉన్న లోలెవల్ వంతెనపై నుంచి వరదనీరు ప్రవహిస్తుంది. దీంతో సిర్పూర్ (టి)-మహరాష్ట్ర వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు అటువైపు వెళ్లకుండ రెవెన్యూ, పోలీసు అధికారులు వంతెనల వద్ద పోలీసు పహరాను ఏర్పాటు చేశారు. పెన్‌గంగా పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఉధృతంగా ప్రవహిస్తున్న ప్రాణహిత
కౌటాల, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కౌటాల మండలం తుమ్డిహేట్టి వద్ద ఉన్న ప్రాణహిత నది ఉధృతంగా ప్రవహిస్తోంది. మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు వార్ధానది ఉప్పొంగి ప్రవహిస్తుండడంతో తుమ్మిడిహెట్టి వద్ద భారీగా నీటి ప్రవాహం పెరిగింది. పుష్కరఘాట్ల మెట్ల వద్దకు తాకుతూ ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం పెరుగుతుండటంతో పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రతమత్తమై ఎవరిని లోని పోనియకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.