Share News

Giripradakshina at Yadagirigutta: యాదగిరిపై మార్మోగిన అయ్యప్ప శరణు ఘోష

ABN , Publish Date - Dec 02 , 2025 | 04:58 AM

స్వామియే శరణం అయ్యప్ప, నమో నారసింహ అంటూ అయ్యప్ప దీక్షాధారులు యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు....

Giripradakshina at Yadagirigutta: యాదగిరిపై మార్మోగిన అయ్యప్ప శరణు ఘోష

  • 25వేల మంది దీక్షాధారుల గిరి ప్రదక్షిణ

యాదగిరిగుట్ట, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): స్వామియే శరణం అయ్యప్ప, నమో నారసింహ అంటూ అయ్యప్ప దీక్షాధారులు యాదగిరిగుట్టలో గిరి ప్రదక్షిణ నిర్వహించారు. ఏకాదశి పర్వదినాన సోమవారం తెల్లవారుజామున 6 గంటలకు కొండకింద వైకుంఠ ద్వారం వద్ద ప్రారంభమైన గిరి ప్రదక్షిణలో సుమారు 25వేల మంది స్వాములు పాల్గొన్నారు. అయ్యప్ప విగ్రహం ఉన్న ప్రత్యేక పల్లకి మోస్తూ కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్ల మేర భజనలు, కీర్తనలతో 45నిమిషాల్లో ప్రదక్షిణ పూర్తి చేశారు. కాలినడకన కొండెక్కిన అయ్యప్ప దీక్షాధారులు గర్భాలయంలోని స్వయంభువులను దర్శించుకున్నారు. గిరిప్రదక్షిణలో పాల్గొని నృసింహుడిని దర్శించుకున్న మాలధారులకు ఆలయంలో సుమారు రూ.3లక్షల విలువైన 230 కిలోల లడ్డు ప్రసాదం వితరణ చేశారు.

Updated Date - Dec 02 , 2025 | 04:58 AM