Share News

22 Maoists Surrender in Odisha: 22 మంది మావోయిస్టుల లొంగుబాటు

ABN , Publish Date - Dec 24 , 2025 | 05:56 AM

మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీ్‌సగఢ్‌కు చెంది న 22 మంది మావోయిస్టులు మంగళవారం ఒడిసా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ వైబి ఖురానియా....

22 Maoists Surrender in Odisha: 22 మంది మావోయిస్టుల లొంగుబాటు

  • వీరిపై రూ.2.18 కోట్ల రివార్డు.. 9 తుపాకుల అప్పగింత

  • లొంగిపోయిన వారిలో పది మంది మహిళలు

  • కర్రెగుట్టల్లో మావోయిస్టు డంప్‌ స్వాధీనం

చర్ల, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీ్‌సగఢ్‌కు చెంది న 22 మంది మావోయిస్టులు మంగళవారం ఒడిసా రాష్ట్రం మల్కన్‌గిరి జిల్లాలో ఆ రాష్ట్ర డీజీపీ వైబి ఖురానియా ముందు లొంగిపోయారు. వీరిపై రూ.2.18 కోట్ల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులు 9 తుపాకులతోపాటు మందుపాతర్లను పోలీసులకు అప్పగించారు. ఈ సందర్బంగా డీజీపీ మాట్లాడుతూ.. మావోయిస్టులు లొంగిపోవడం సంతోషకరమని, లొంగిపోయిన వారికి ప్రభుత్వ సాయం అందజేయడంతోపాటు ఉపాధి చూపుతామన్నారు. లొంగిపోయిన వారిలో దండకారణ్య స్పెషల్‌ జోన్‌ కమిటీ, కేరపాల్‌ కమిటీ, ఆంధ్రా, ఒడిసా బోర్డర్‌ కమిటీకి చెందిన సభ్యులున్నారని తెలిపారు. వీరిలో ఒక డీవీసీఎం సభ్యు డు, ఆరుగురు ఏరియా కమిటీ సభ్యులు, ఇతరులున్నా రు. లొంగిపోయిన వారిలో 10 మంది మహిళలు ఉన్నా రు. కాగా ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా ఊసూరు పోలీ్‌సస్టేషన్‌ పరిధిలోని కర్రె గుట్టల్లో ఉన్న డోలి గుట్టల్లో మంగళవారం మావోయిస్టు పార్టీ చెందిన భారీ డంప్‌ను కేంద్ర బలగాలు గుర్తించాయి. ఈ డంప్‌లో మందుపాతర్లు, లాంఛర్లు, ఆయుధాలు తయారు చేసే యంత్రాలు ఉన్నాయి. వీటిని బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. సోమవారం ఇదే తరహాలో సుకుమా జిల్లా అడవుల్లో కూడా మావోయిస్టు పార్టీ ఆయుధ కర్మాగారాన్ని కేంద్ర బలగాలు గుర్తించిన విషయం తెలిసిందే.

Updated Date - Dec 24 , 2025 | 05:56 AM