Panchayat Officers: 18 మంది ఎంపీవోలకు పదోన్నతులు
ABN , Publish Date - Sep 11 , 2025 | 06:04 AM
పలు జిల్లాలకు చెందిన 18 మంది మండల పంచాయతీ అధికారుల ఎంపీవో కు డివిజనల్ పంచాయతీ...
హైదరాబాద్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): పలు జిల్లాలకు చెందిన 18 మంది మండల పంచాయతీ అధికారుల(ఎంపీవో)కు డివిజనల్ పంచాయతీ అధికారులు(డీఎల్‌పీవో)గా రాష్ట్ర ప్రభుత్వం బుధవారం పదోన్నతులు కల్పించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ జి.సృజన ఓ ప్రొసీడింగ్ జారీ చేశారు. అడహక్ పద్ధతిన ఎంపీవోలకు పదోన్నతులు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. వరంగల్, నిర్మల్, జగిత్యాల, సిద్దిపేట, మెదక్, సిరిసిల్ల, భూపాలపల్లి, ఆసిఫాబాద్, ఖమ్మం, హన్మంకొండ, మంచిర్యాల జిల్లాల పరిధిలోని ఆయా డివిజన్లను డీఎల్‌పీలుగా పదోన్నతి పొందినవారికి కేటాయించినట్లు తెలిపారు