Share News

DA Approved: వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:51 PM

డీఏ పెంపు ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఆమోదం తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఉద్యోగులందరికీ డీఏ వర్తిస్తుంది.

DA Approved: వారికి గుడ్‌న్యూస్ చెప్పిన ప్రభుత్వం
DA Approved

విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. 17.651 శాతం డీఏను ఖరారు చేసింది. 2025 , జూలై 1వ తేదీ నుంచి ఈ డీఏ అమలు కానుంది. డీఏ పెంపు ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క  ఆమోదం తెలిపారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ పరిధిలోని ఉద్యోగులందరికీ డీఏ వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మొత్తం 71,387 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. అంతేకాకుండా విద్యుత్ సంస్థలపై నెలకు 9.39 కోట్ల రూపాయల అదనపు ఆర్థిక భారం పడనుంది.

Updated Date - Dec 22 , 2025 | 05:59 PM