Share News

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లకు 1435 కోట్లు విడుదల

ABN , Publish Date - Sep 16 , 2025 | 05:26 AM

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు ఇప్పటివరకు 1,435 కోట్లు విడుదల చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ వీపీ గౌతమ్‌ వెల్లడించారు...

Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్లకు 1435 కోట్లు విడుదల

ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్ధిదారులకు ఇప్పటివరకు 1,435 కోట్లు విడుదల చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్‌ డైరక్టర్‌ వీపీ గౌతమ్‌ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.15 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాగా, 1.29 లక్షల ఇళ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. వీటిలో సుమారు 20 వేల ఇళ్లు గోడల దశలో, 8,633 ఇళ్లు పైకప్పు దశలో ఉన్నాయి. పలుచోట్ల ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని లబ్ధిదారులు గృహ ప్రవేశాలు కూడా చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇంటి నిర్మాణ పురోగతిని బట్టి ప్రతి సోమవారం లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోనే నగదు జమచేస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం 13,841 మంది లబ్ధిదారులకు రూ.146.30 కోట్లు విడుదల చేసినట్లు గృహ నిర్మాణ సంస్థ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.

Updated Date - Sep 16 , 2025 | 05:26 AM