Share News

Fake E Way Bills Scam: ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పేరుతో 11.79 కోట్ల మోసం

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:19 AM

నకిలీ పత్రాలతో డొల్ల కంపెనీలు స్థాపించి నకిలీ ఇన్‌వాయి్‌సలు, ఇతర పత్రాలతో ప్రభుత్వాన్ని మోసం చేసి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పేరుతో...

Fake E Way Bills Scam: ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పేరుతో 11.79 కోట్ల మోసం

  • నకిలీ ఈ-వేబిల్లులతో రూ.58.73 కోట్ల టర్నోవర్‌ చూపిన వైనం

  • ఇద్దరు నిందితుల అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): నకిలీ పత్రాలతో డొల్ల కంపెనీలు స్థాపించి నకిలీ ఇన్‌వాయి్‌సలు, ఇతర పత్రాలతో ప్రభుత్వాన్ని మోసం చేసి ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ పేరుతో రూ.11.79 కోట్లు మోసం చేసిన ముఠా గుట్టురట్టయింది. ఇద్దరు నిందితులు సొహైల్‌, హన్సుద్దీన్‌ల సైబరాబాద్‌ ఆర్థిక నేరాల విభాగం(ఈవోడబ్ల్యూ) అధికారులు గురువారం అరెస్ట్‌ చేశారు. ఢిల్లీకి చెందిన అబ్దుల్లాను ప్రధాన సూత్రధారిగా గుర్తించారు. అతనితోపాటు అబిడ్స్‌లో ఉంటున్న గుజరాత్‌కు చెందిన సొహైల్‌ అలియాస్‌ సోను(34), అడిక్‌మెట్‌కు చెందిన మహ్మద్‌ హన్సుద్దీన్‌(43), సయ్యద్‌ హుస్సేని అలియాస్‌ ఆజం, ఆయాతి రాజశేఖర్‌లు ముఠాగా ఏర్పడ్డారు. నకిలీ ఆధార్‌, పాన్‌, కరెంట్‌ బిల్లు, రెంటల్‌ అగ్రిమెంట్‌లు, జీహెచ్‌ఎంసీ లైసెన్స్‌, లేబర్‌ లైసెన్స్‌, చిరునామాలతో వీరు పలు సంస్థలను రిజిస్టర్‌ చేయించారు. తర్వాత నకిలీ ఇన్‌వాయి్‌సలతో సంస్థలకు ఆదాయం ఉన్నట్లు చూపారు. నకిలీ ఈ-వే బిల్లులు రూపొందించి కోట్లలో టర్నోవర్‌ చూపారు. ఈ ముఠా తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడు, హరియాణా, ఒడిసా, ఛత్తీ్‌సగఢ్‌, కర్ణాటక, గుజరాత్‌ రాష్ట్రాల్లో కాగితాలపై మొత్తం 52 సంస్థలను ప్రారంభించింది. నకిలీ పత్రాలతో రూ.58.73 కోట్ల టర్నోవర్‌ చూపారు. 405 నకిలీ ఈ-వేబిల్లులు, 10 జీఎ్‌సటీ రిజిస్ట్రేషన్‌లతో ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ కింద 11.79 కోట్లు క్లెయిమ్‌ చేసుకున్నారు. జీఎ్‌సటీ అధికారుల ఫిర్యాదుతో ఈ మోసానికి సంబంధించి ఈవోడబ్ల్యూలో కేసు నమోదైంది.

Updated Date - Nov 14 , 2025 | 04:19 AM