Student Suicide: పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:18 AM
నిజామాబాద్ ్ఠజిల్లా చందూర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మపురి హిల్స్ కాలనీకి చెందిన.....
మైనార్టీ గురుకులంలో ఉరి వేసుకుని బలవన్మరణం
మోస్రా, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నిజామాబాద్ ్ఠజిల్లా చందూర్‌లోని మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థి సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ధర్మపురి హిల్స్ కాలనీకి చెందిన షేక్ మూసా(16) రాత్రి ఎప్పటిలాగే తోటి విద్యార్థులతో కలిసి గదిలో పడుకున్నాడు.. ఉదయానికల్లా ఉరి వేసుకుని కనిపించాడు. ఇంట్లో కలహాలు, ప్రేమ వ్యవహారం కారణంగానే మనస్తాపానికి గురైనట్లు.. మూసా స్నేహితుల వద్ద చెప్పినట్లు తెలిసింది. విద్యార్థి ఆత్మహత్యకు ప్రిన్సిపాల్, సిబ్బంది నిర్ల్యక్ష్యమే కారణమని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు, కుటుంబ సభ్యులు వసతి గృహం ఎదుట ధర్నా నిర్వహించారు.