Muradi Narsavva: శతాధిక వృద్ధురాలి మృతి
ABN , Publish Date - Oct 31 , 2025 | 02:46 AM
మెదక్ జిల్లా చేగుంటకు చెందిన మురాడి నర్సవ్వ(105) అనే శతాధిక వృద్ధురాలు గురువారం మరణించారు. 1920లో నర్సవ్వ జన్మించారు....
చేగుంట, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): మెదక్ జిల్లా చేగుంటకు చెందిన మురాడి నర్సవ్వ(105) అనే శతాధిక వృద్ధురాలు గురువారం మరణించారు. 1920లో నర్సవ్వ జన్మించారు. స్వాతంత్య్రం రాకముందు, వచ్చిన తర్వాత దేశంలోని పరిస్థితులను చూసిన సర్సవ్వ.. పల్లె సంప్రదాయాలకు విలువ ఇచ్చేవారు. 105 ఏళ్లు వయస్సులోనూ తన పనులు తానే స్వయంగా చేసుకుంటూ ఆరోగ్యంగానే ఉన్న నర్సవ్వ.. గురువారం ఉదయం వయోభారంతో తుది శ్వాస విడిచారు. నర్సవ్వ కుమారుడు, కోడలు, ఇద్దరు మనువళ్లు అనారోగ్యం వల్ల ఇది వరకే మరణించారు. ఆమె ముగ్గురు మనుమరాళ్లు(కొడుకు కుమార్తెలు) మాత్రమే ఆ కుటుంబంలో ప్రస్తుతం ఉన్నారు.