New High Court: నూతన హైకోర్టు భవన నిర్మాణానికి వంద ఎకరాల భూమి..
ABN , Publish Date - Sep 25 , 2025 | 05:30 AM
రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన వంద ఎకరాల భూమిని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ బుధవారం పరిశీలించారు...
పరిశీలించిన హైకోర్టు సీజే
హైదరాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాజేంద్రనగర్‌లో నూతన హైకోర్టు భవన నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన వంద ఎకరాల భూమిని హైకోర్టు చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా పూజలు నిర్వహించారు. ఆయనతో పాటు హైకోర్టు సీనియర్ న్యాయమూర్తులు జస్టిస్ శ్యాంకోషీ, జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బి.విజయ్‌సేన్ రెడ్డి, ఏజీ సుదర్శన్‌రెడ్డి తదితరులతో కలిసి సీజే ఉన్నారు.