Final Test: సమం చేస్తారా
ABN , Publish Date - Jul 31 , 2025 | 05:38 AM
మాంచెస్టర్ టెస్ట్‌లో అద్భుత పోరాటాన్ని ప్రదర్శించిన భారత జట్టు.. ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించాలనుకొంటోంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీ్‌సలో 1-2తో వెనుకంజలో ఉన్న శుభ్‌మన్ గిల్ సేన...
జోష్‌లో యువ భారత్
ఆఖరి టెస్ట్ నేటి నుంచే
మ. 3.30 నుంచి సోనీ నెట్‌వర్క్‌లో..
ఫ సూపర్ ఫామ్‌లో గిల్, జడేజా, రాహుల్
ఫ బుమ్రాపై కొనసాగుతున్న సస్పెన్స్
ఫ స్టోక్స్ దూరం ఫ డీలాపడిన ఇంగ్లండ్
లండన్: మాంచెస్టర్ టెస్ట్‌లో అద్భుత పోరాటాన్ని ప్రదర్శించిన భారత జట్టు.. ఇంగ్లండ్ పర్యటనను విజయంతో ముగించాలనుకొంటోంది. ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీ్‌సలో 1-2తో వెనుకంజలో ఉన్న శుభ్‌మన్ గిల్ సేన.. గురువారం నుంచి ఓవల్‌లో జరిగే ఐదో, ఆఖరి మ్యాచ్‌లో గెలిచి సిరీ్‌సను సమం చేయాలనే పట్టుదలతో ఉంది. లార్డ్స్‌లో క్రాలేతో గిల్ వాగ్వాదం.. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో స్టోక్స్ డ్రా ప్రతిపాదనకు జడేజా నో చెప్పడం.. తాజాగా క్యూరేటర్ లీ ఫోర్టి్‌సపై గంభీర్ ఆగ్రహం లాంటి ఘటనలతో సిరీస్ హాట్‌హాట్‌గా మారింది. రోహిత్, కోహ్లీ, అశ్విన్ లాంటి స్టార్లు లేకుండా.. యువ ఆటగాడు గిల్ సారథ్యంలో ఇంగ్లండ్ వెళ్లిన భారత్ కొన్నిసార్లు తడబడినా.. ఓవరాల్‌గా ఢీ అంటే ఢీ అన్నట్టుగానే ఎదురు నిలిచింది. పైగా, స్టోక్స్ గైర్హాజరీలో డీలాపడ్డ ఇంగ్లండ్‌కు నాకౌట్ పంచ్ ఇచ్చేందుకు గిల్ సేనకు ఇదో సువర్ణావకాశం.
బ్యాటర్లు అదరహో..
నాలుగో టెస్ట్‌లో చాలా భాగం ఆతిథ్య జట్టుదే ఆధిపత్యమే అయినా.. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటర్ల అసాధారణ పోరాటంతో భారత్ డ్రాతో గట్టెక్కింది. ముఖ్యంగా కీలక బ్యాటర్లు సూపర్ ఫామ్‌లో ఉండడం టీమిండియా ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. ఓపెనర్ రాహుల్ నిలకడగా రాణిస్తుండగా.. గిల్ మళ్లీ టచ్‌లోకి రావడం శుభపరిణామం. అయితే, మరో ఓపెనర్ జైస్వాల్ వరుస వైఫల్యాలు జట్టును దెబ్బ తీస్తున్నాయి. సాయు సుదర్శన్ క్రీజులో నిలిచేందుకు ప్రయత్నించాలి. గత మ్యాచ్‌లో చిరస్మరణీయ
శతకాలు సాధించిన జడేజా, సుందర్ నుంచి జట్టు అదే తరహా ప్రదర్శనను కోరుకొంటోంది. గాయంతో రిషభ్ పంత్ చివరి మ్యాచ్‌కు దూరమవడంతో.. ధ్రువ్ జురెల్ కీపర్‌గా తుది జట్టులోకి రానున్నాడు. పంత్ లేకపోవడంతో బ్యాటింగ్ డెప్త్ కోసం శార్దూల్ ఠాకూర్‌ను కొనసాగించడానికే మేనేజ్‌మెంట్ మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. అంటే, స్పిన్నర్ కుల్దీ్‌పకు మరోసారి నిరాశే. పేస్ గన్ బుమ్రా విషయంలో ఇంకా సస్పెన్స్ వీడలేదు. మ్యాచ్ ఆరంభానికి ముందు పిచ్‌ను బట్టి నిర్ణయం తీసుకొంటామని గిల్ చెప్పాడు. సిరాజ్, ఆకాశ్‌దీ్‌ప ప్రధాన బౌలర్లు కాగా.. బుమ్రా దూరమైతే అర్ష్‌దీ్‌పకు చాన్స్ దక్కొచ్చు.
మరోసారి బాజ్‌బాల్?
మరోవైపు కెప్టెన్ స్టోక్స్ దూరం కావడంతోపాటు పేసర్ జోఫ్రా ఆర్చర్, కార్స్‌కు విశ్రాంతినివ్వడంతో ఇంగ్లండ్ కొంత బలహీనంగా కనిపిస్తోంది. బెన్ గైర్హాజరీలో ఓలీ పోప్ జట్టును నడిపించనున్నాడు. ఇంగ్లండ్ మొత్తంగా నాలుగు మార్పులతో బరిలోకి దిగుతోంది. బాజ్‌బాల్ ఆడాలనే వ్యూహంతోనే స్పిన్నర్ డాసన్‌ను తప్పించి హిట్టర్ జాకబ్ బెథల్‌ను జట్టులోకి తీసుకొన్నట్టుగా కనిపిస్తోంది. గస్ అట్కిన్సన్, ఓవర్టన్, జోష్ టంగ్ జట్టులోకి వచ్చారు. స్టోక్స్ దూరం కావడంతో జట్టు భారం మొత్తం బ్యాటర్లే మోయాల్సిన పరిస్థితి.
జట్లు
భారత్ (అంచనా): జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సుందర్, జడేజా, ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), శార్దూల్, అర్ష్‌దీప్/ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్, ఆకాశ్‌దీ్‌ప.
ఇంగ్లండ్: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథల్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, అట్కిన్సన్, ఓవర్టన్, జోష్ టంగ్.
పిచ్/వాతావరణం:
వికెట్‌పై పచ్చిక కనిపిస్తుండడంతో పేసర్లకు సహకరిస్తుందని భావిస్తున్నారు. టాస్ గెలిచిన టీమ్ బౌలింగ్ ఎంచుకొనే అవకాశం ఉంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం. ఇటీవలే ఇక్కడ జరిగిన కౌంటీ మ్యాచ్‌లో సర్రే 820/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మూడు వారాల కిత్రం వాతావరణం వేడిగా ఉన్నా.. ప్రస్తుతం చల్లగా మారింది. తొలి రోజు మధ్యాహ్నం మళ్లీ చివరి రెండు రోజులు ఓ మోస్తరు వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ చెబుతోంది.
గిల్ మరో 52 పరుగులు సాధిస్తే.. ఓ సిరీస్‌లో అత్యధిక పరుగులు స్కోరు చేసిన భారత ఆటగాడిగా సునీల్ గవాస్కర్‌ను అధిగమిస్తాడు. ఈ సిరీ్‌సలో గిల్ ఇప్పటి వరకు 722 రన్స్ చేశాడు.
స్టోక్స్‌కు గాయం..
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ భుజం గాయంతో చివరి టెస్ట్‌కు దూరమయ్యాడు. మాంచెస్టర్ టెస్ట్‌లో తొలి ఇన్నింగ్స్‌లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన స్టోక్స్.. రెండో ఇన్నింగ్స్‌లో భుజం నొప్పితో బాధపడుతూనే బౌలింగ్ చేశాడు. కండర గాయం కావడంతో కోలుకోవడానికి సుమారు ఆరు వారాల సమయం పట్టే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి..
మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..