WPL Schedule: జనవరి 9 నుంచి డబ్ల్యూపీఎల్
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:01 AM
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5జట్లు పాల్గొనే డబ్ల్యూపీఎల్ వచ్చే జనవరి 9 నుంచి...
ఫిబ్రవరి 5న ఫైనల్
నవీ ముంబై, వడోదరలో మ్యాచ్‌లు
ముంబై: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) నాలుగో సీజన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మొత్తం 5జట్లు పాల్గొనే డబ్ల్యూపీఎల్ వచ్చే జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరుగనుంది. వాస్తవానికి తొలి మూడు సీజన్లు ఫిబ్రవరి-మార్చిలో జరిగాయి. కానీ ఈసారి ఫిబ్రవరి 7 నుంచి స్వదేశంలో టీ20 వరల్డ్‌కప్ జరుగుతుండడంతో డబ్ల్యూపీఎల్‌ను ముందుకు జరిపారు. ఇక.. 28 రోజుల పాటు జరిగే ఈ లీగ్‌లో తొలి 11 మ్యాచ్ (ఇందులో రెండు డబుల్ హెడర్లు)లకు నవీ ముంబై, మిగతా 11 మ్యాచ్ (ఎలిమినేటర్, ఫైనల్)లకు వడోదర ఆతిథ్యం ఇవ్వనున్నాయి. డిఫెండింగ్ చాంప్ ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మధ్య ఆరంభ మ్యాచ్ జరుగనుంది. ఇక, తొలిసారిగా ఫైనల్ మ్యాచ్‌ను వీకెండ్‌లో కాకుండా గురువారం నిర్వహిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?