World Chess Cup: సెమీస్ ఫలితాలు టైబ్రేక్‌కు
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:23 AM
చెస్ వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడే ప్రత్యర్థులు ఎవరనేది ఆదివారం జరిగే టైబ్రేక్‌లో తేలనుంది. సెమీ్‌సలో భాగంగా శనివారం జరిగిన రెండో క్లాసిక్ గేమ్‌లో కూడా...
పనాజీ: చెస్ వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడే ప్రత్యర్థులు ఎవరనేది ఆదివారం జరిగే టైబ్రేక్‌లో తేలనుంది. సెమీ్‌సలో భాగంగా శనివారం జరిగిన రెండో క్లాసిక్ గేమ్‌లో కూడా ఉజ్బెకిస్థాన్ జీఎంలు నోడిర్‌బెక్‌తో జవోకిర్ సిండరోవ్, ఆండ్రీ ఎసిపెంకో (రష్యా)తో చైనా జీఎం వి యి పాయింట్ పంచుకొన్నారు. స్కోర్లు 1-1తో సమం కావడంతో ఫలితం టైబ్రేక్‌కు మళ్లింది.
భారత మహిళల ఓటమి
మహిళల వరల్డ్ టీమ్ చాంపియన్‌షి్‌పలో భారత జట్టుకు షాక్ తగిలింది. క్వార్టర్స్‌లో భారత్ 2-4తో కజకిస్థాన్ చేతిలో ఓడింది. రెండు జట్లూ చెరోగేమ్ నెగ్గడంతో ఫలితం టైబ్రేక్‌కు దారి తీసింది. అయితే, నిర్ణాయక టైబ్రేక్‌లో భారత్ 1.5-2.5తో పరాజయం పాలైంది.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..