Share News

విశాఖలో ఐదు మ్యాచ్‌లు

ABN , Publish Date - Jun 17 , 2025 | 02:14 AM

భారత్‌, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. సెప్టెంబరు 30 నుంచి జరిగే ఈ మెగా టోర్నీ నవంబరు 2న ముగుస్తుంది...

విశాఖలో ఐదు మ్యాచ్‌లు

కొలంబోలో అక్టోబరు 5న భారత్‌-పాక్‌ పోరు

మహిళల వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌

సెప్టెంబరు 30న టోర్నీ ఆరంభం

న్యూఢిల్లీ: భారత్‌, శ్రీలంక ఆతిథ్యమివ్వనున్న మహిళల వన్డే వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ సోమవారం విడుదల చేసింది. సెప్టెంబరు 30 నుంచి జరిగే ఈ మెగా టోర్నీ నవంబరు 2న ముగుస్తుంది. మొత్తం 8 జట్లు రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పద్దతిన మిగతా అన్ని టీమ్స్‌తోనూ ఆడాల్సి ఉంటుంది. ఇక బెంగళూరులో జరిగే ఆరంభ మ్యాచ్‌లో భారత్‌-శ్రీలంక తలపడనున్నాయి. ఇక, టోర్నీలో ఐదు మ్యాచ్‌లకు విశాఖపట్నం వేదిక కానుండడం విశేషం. కాగా, అందరి దృష్టిని ఆకర్షించే పాకిస్థాన్‌తో హర్మన్‌ప్రీత్‌ సేన పోరు కొలంబోలో అక్టోబరు 5వ తేదీన జరుగనుంది. చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడేందుకు భారత పురుషుల జట్టు పాక్‌కు వెళ్లకపోవడంతో భవిష్యత్‌లో ఇరు జట్ల మ్యాచ్‌లను హైబ్రిడ్‌ పద్దతిన ఆడించాలనే నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంట్లో భాగంగా పాక్‌ జట్టు శ్రీలంకలోనే తమ వరల్డ్‌కప్‌ గ్రూప్‌ మ్యాచ్‌లను ఆడబోతోంది. అంతేకాకుండా శ్రీలంక మొత్తంగా 11 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వబోతోంది. ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ జట్లతో తమ మ్యాచ్‌లను శ్రీలంక స్వదేశంలోనే ఆడనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా అక్టోబరు ఒకటిన కివీస్‌తో మ్యాచ్‌తో తమ ప్రస్థానాన్ని ఆరంభించనుంది. రౌండ్‌ రాబిన్‌ దశలో టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీ్‌సకు వెళతాయి. ఇందులో తొలి స్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానం జట్టుతో.. రెండో స్థానంలో నిలిచిన జట్టు మూడో స్థానం జట్టుతో తలపడతాయి. అలాగే తొలి సెమీస్‌ అక్టోబరు 29న గువాహటి/కొలంబోలో నిర్వహించనున్నారు. మర్నాడే మరో సెమీస్‌ బెంగళూరులో జరుగుతుంది. నవంబరు 2న జరిగే ఫైన ల్‌కు బెంగళూరు లేదా కొలంబో వేదిక కానుంది. పాక్‌ జట్టు అర్హత సాధించడాన్ని బట్టి ఈ రెండింట్లో ఓ వేదికను ఖరారు చేస్తారు.


విశాఖలో మ్యాచ్‌లు ఇవీ..

మహిళల వన్డే వరల్డ్‌క్‌పనకు భారత్‌లో బెంగళూరు, ఇండోర్‌, గువాహటిలతో పాటు విశాఖపట్నం కూడా ఆతిథ్యమివ్వనుంది. విశాఖలో ఐదు మ్యాచ్‌లు జరుగనుండగా.. అక్టోబరు 9న మొదట భారత్‌-దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. అలాగే అక్టోబరు 10న న్యూజిలాండ్‌-బంగ్లాదేశ్‌, 12న భారత్‌-ఆస్ట్రేలియా, 13న దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్‌, 16న ఆస్ట్రేలియా-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లను కూడా ఇక్కడే నిర్వహిస్తారు.

భారత జట్టు షెడ్యూల్‌

తేదీ ప్రత్యర్థి వేదిక

సెప్టెంబరు 30 శ్రీలంక బెంగళూరు

అక్టోబరు 5 పాకిస్థాన్‌ కొలంబో

అక్టోబరు 9 దక్షిణాఫ్రికా విశాఖపట్నం

అక్టోబరు 12 ఆస్ట్రేలియా విశాఖపట్నం

అక్టోబరు 19 ఇంగ్లండ్‌ ఇండోర్‌

అక్టోబరు 23 న్యూజిలాండ్‌ గువాహటి

అక్టోబరు 26 బంగ్లాదేశ్‌ బెంగళూరు

ఇవీ చదవండి:

ఇంగ్లండ్‌కు జడేజా భయం

బుమ్రా-గిల్ అదిరిపోయే స్కెచ్

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 17 , 2025 | 02:14 AM