Share News

విండీస్ ను ఊడ్చేశారు

ABN , Publish Date - Jun 12 , 2025 | 05:13 AM

వెస్టిండీ్‌సతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీ్‌సను ఆతిథ్య ఇంగ్లండ్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆఖరి మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో కరీబియన్లను ఓడించింది...

విండీస్ ను ఊడ్చేశారు

సౌతాంప్టన్‌ (ఇంగ్లండ్‌): వెస్టిండీ్‌సతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీ్‌సను ఆతిథ్య ఇంగ్లండ్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. ఆఖరి మ్యాచ్‌లో 37 పరుగుల తేడాతో కరీబియన్లను ఓడించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌.. ఓపెనర్లు బెన్‌ డకెట్‌ (84), జేమీ స్మిత్‌ (60) అర్ధ శతకాలతో మెరవడంతో 20 ఓవర్లలో 248/3 స్కోరు చేసింది. బెతెల్‌ (36 నాటౌట్‌), బ్రూక్‌ (35 నాటౌట్‌) రాణించారు. ఛేదనలో ల్యూక్‌ వుడ్‌ (3/31), రషీద్‌ (2/30) ధాటికి విండీస్‌ 211/8 స్కోరుకే పరిమితమై ఓటమి పాలైంది. పావెల్‌ (79 నాటౌట్‌), హోప్‌ (45) సత్తా చాటినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే మూడు వన్డేల సిరీ్‌సను కూడా 0-3తో కోల్పోయిన విండీస్‌.. ఇంగ్లండ్‌ టూర్‌ను ఒక్క గెలుపూ లేకుండానే ముగించింది.

ఇవీ చదవండి:

కోహ్లీ లేడనే ధైర్యంతో..!

ఆ పని చేస్తే తిరుగుండదు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 12 , 2025 | 05:13 AM