Share News

Wimbledon 2025: ఒకే పార్శ్వంలో సినర్‌, జొకోవిచ్‌

ABN , Publish Date - Jun 28 , 2025 | 04:33 AM

ఇటలీ స్టార్‌ జానిక్‌ సినర్‌, నొవాక్‌ జొకోవిచ్‌ సోమవారంనుంచి జరిగే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఒకే పార్శ్వ్యంలో తలపడనున్నారు. సినర్‌ తొలి రౌండ్‌లో తన దేశానికే చెందిన లుకా నార్డీని ఢీకొంటాడు.

Wimbledon 2025: ఒకే పార్శ్వంలో సినర్‌, జొకోవిచ్‌

  • వింబుల్డన్‌ డ్రా

లండన్‌: ఇటలీ స్టార్‌ జానిక్‌ సినర్‌, నొవాక్‌ జొకోవిచ్‌ సోమవారంనుంచి జరిగే వింబుల్డన్‌ గ్రాండ్‌స్లామ్‌లో ఒకే పార్శ్వ్యంలో తలపడనున్నారు. సినర్‌ తొలి రౌండ్‌లో తన దేశానికే చెందిన లుకా నార్డీని ఢీకొంటాడు. ఇక జొకో మొదటి రౌండ్‌లో ముల్లెర్‌ (ఫ్రాన్స్‌)తో తలపడతాడు. అల్కారజ్‌...ఫోగ్నినీ (ఇటలీ)తో టోర్నీని ఆరంభిస్తాడు. మహిళల్లో.. కొకో గాఫ్‌..ఎనిమిదో సీడ్‌ స్వియటెక్‌తో క్వార్టర్‌ఫైనల్లో తలపడే చాన్సుంది. తొలి రౌండ్‌లో డయానా యాస్త్రెంస్కా (ఉక్రెయిన్‌)ను గాఫ్‌ ఢీకొననుంది. ఇక..కుడెర్మెటోవాతో మొదటి రౌండ్‌లో స్వియటెక్‌ అమీతుమీ తేల్చుకోనుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ క్రెజికోవా-అలెగ్జాండ్రా ఇలాతో టోర్నమెంట్‌ను ఆరంభించనుంది.

Updated Date - Jun 28 , 2025 | 04:34 AM