బెంగళూరు కల నెరవేరేనా?
ABN , Publish Date - Mar 18 , 2025 | 04:23 AM
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కు విరాట్ కోహ్లీ ప్రధాన ఆకర్షణ. బ్యాటింగ్‌లో ఎంతో బలంగా కనిపించే బెంగళూరు గత 17 సీజన్లలో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. కప్ మనదే అంటూ...
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ)కు విరాట్ కోహ్లీ ప్రధాన ఆకర్షణ. బ్యాటింగ్‌లో ఎంతో బలంగా కనిపించే బెంగళూరు గత 17 సీజన్లలో ఒక్కసారి కూడా విజేతగా నిలవలేదు. కప్ మనదే అంటూ దిగడం.. నిరాశగా వెనుదిరగడం షరా మామూలుగా మారింది. అయితే, ఈసారి మాత్రం తలరాతను మార్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గతేడాది వరుస విజయాలతో పేఆ్‌ఫ్సకు చేరినా.. నాకౌట్‌లో తడబడింది. కాగా, గత సీజన్‌లో కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసీని వదిలేయడంతో.. ఈసారి అనూహ్యంగా రజత్ పటీదార్‌కు నాయకత్వ బాధ్యతలు అప్పగించారు. బ్యాటింగ్‌లో కోహ్లీతోపాటు పటీదార్, ఫిల్ సాల్ట్, దేవ్‌దత్ పడిక్కల్ కీలకం. జితేష్, టిమ్ డేవిడ్ ఫినిషర్ల పాత్ర పోషించనున్నారు. భువనేశ్వర్, హాజెల్‌వుడ్ పేస్ బౌలింగ్ భారాన్ని మోయనున్నారు.
అయితే, స్పిన్ విభాగం కొంత బలహీనంగా కనిపిస్తోంది. ఆల్‌రౌండర్లు లివింగ్‌స్టోన్, క్రునాల్ పాండ్యాతోపాటు సుయాష్ శర్మ, మోహిత్ రాఠే స్పిన్ విభాగాన్ని నడిపించనున్నారు. బెంచ్ బలం పెద్దగా లేకపోవడం కూడా లోటుగానే పరిగణించాలి. గత సీజన్‌లో ఆశలు లేని స్థితి నుంచి ప్లేఆ్‌ఫ్సకు చేరిన ఆర్‌సీబీ ఈసారి కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనుకొంటోంది.
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు
బ్యాటర్లు: రజత్ పటీదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, దేవ్‌దత్ పడిక్కల్, స్వస్తిక్ చికార;
వికెట్ కీపర్లు: జితేష్ శర్మ, ఫిల్ సాల్ట్;
ఆల్‌రౌండర్లు: లియామ్ లివింగ్‌స్టోన్, క్రునాల్ పాండ్యా, స్వప్నిల్ సింగ్, టిమ్ డేవిడ్, రొమారియో షెఫర్డ్, మనోజ్, జాకబ్ బెథల్;
బౌలర్లు: భువనేశ్వర్, హాజెల్‌వుడ్, రసిక్ దార్, సుయాష్, నువాన్ తుషార, లుంగీ ఎన్‌గిడి, అభినందన్ సింగ్, మోహిత్ రాఠే, యష్ దయాళ్.
Read Also : Sourav Ganguly in Khakee: ఖాకీ సిరీస్‌లో గంగూలీ.. టీజర్‌లో షాకిచ్చిన బెంగాల్ టైగర్.. అసలు కథేంటంటే..