When Will Rohit and Kohli: రో కో మళ్లీ ఆడేదెప్పుడంటే
ABN , Publish Date - Oct 27 , 2025 | 06:18 AM
టీమిండియా దిగ్గజ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో తమ అభిమానులను అలరించారు. ఆసీ్‌సతో...
న్యూఢిల్లీ : టీమిండియా దిగ్గజ బ్యాటింగ్ ద్వయం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాతో చివరి వన్డేలో అద్భుత బ్యాటింగ్‌తో తమ అభిమానులను అలరించారు. ఆసీ్‌సతో మూడు వన్డేల సిరీసే కావడంతో..అక్కడ వారి పర్యటన ముగిసింది. రోహిత్, కోహ్లీ కేవలం వన్డేలకే పరిమితం కావడంతో వారు మళ్లీ భారత జట్టు తరపున బరిలోకి దిగేదెప్పుడనే చర్చ ఫ్యాన్స్‌లో మొదలైంది. టీమిండియా తదుపరి వన్డే సిరీ్‌సను స్వదేశంలో దక్షిణాఫ్రికాతో ఆడనుంది. వచ్చేనెల 30న రాంచీలో జరిగే మ్యాచ్‌తో ఈ సిరీస్ ఆరంభమవుతుంది. డిసెంబరు మూడు, ఆరు తేదీలలో మిగిలిన రెండు వన్డేలు జరుగుతాయి.