Share News

మూడో టీ20లో ఐర్లాండ్‌పై విండీస్‌ విజయం

ABN , Publish Date - Jun 16 , 2025 | 03:41 AM

ఐర్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్‌ 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ను కూడా 1-0తో గెలుచుకుంది. తొలి రెండు మ్యాచ్‌లు...

మూడో టీ20లో ఐర్లాండ్‌పై విండీస్‌ విజయం

బ్రీడీ: ఐర్లాండ్‌తో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్‌ 62 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్‌ను కూడా 1-0తో గెలుచుకుంది. తొలి రెండు మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దయ్యాయి. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన విండీస్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 256 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్లు ఎవిన్‌ లెవిస్‌ (91), హోప్‌ (51) తొలి వికెట్‌కు 122 పరుగులు జత చేశారు. చివర్లో కీసీ కార్టీ (49 నాటౌట్‌), షెఫర్డ్‌ (19 నాటౌట్‌) చెలరేగారు. మాథ్యూ రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఛేదనలో ఐర్లాండ్‌ 20 ఓవర్లలో 194/7 స్కోరుకే పరిమితమై ఓటమి పాలైంది. రాస్‌ ఎడెయిర్‌ (48), టెక్టర్‌ (38), మార్‌ ఎడెయిర్‌ (31 నాటౌట్‌) మాత్రమే రాణించారు. హొసేన్‌కు మూడు, హోల్డర్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఇవీ చదవండి:

ఐదేళ్లలో 6 ఐసీసీ టోర్నీలు

వెళ్లి గల్లీ క్రికెట్ ఆడుకోండి

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 16 , 2025 | 03:41 AM