Virat Kohli: ఆర్నెల్ల తర్వాత స్వదేశానికి విరాట్
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:44 AM
లండన్‌లో నివాసముంటున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో అడుగుపెట్టాడు. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్...
న్యూఢిల్లీ: లండన్‌లో నివాసముంటున్న స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆరు నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌లో అడుగుపెట్టాడు. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడుతున్న విషయం తెలిసిందే. దీంతో ఈనెల 30 నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం జట్టుతో పాటు చేరనున్నాడు. ఈ ఏడాది మేలో ఐపీఎల్‌లో ఆర్‌సీబీ విజేతగా నిలిచాక లండన్ వెళ్లిపోయిన విరాట్.. అక్కడి నుంచే ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లి వన్డే సిరీస్ ఆడాడు.
ఇవి కూడా చదవండి:
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!