Share News

Amit Mishra Announces Retirement: క్రికెట్‌కు అమిత్‌ మిశ్రా గుడ్‌బై

ABN , Publish Date - Sep 05 , 2025 | 02:45 AM

భారత వెటరన్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా 42 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 25 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు..

Amit Mishra Announces Retirement: క్రికెట్‌కు అమిత్‌ మిశ్రా గుడ్‌బై

న్యూఢిల్లీ: భారత వెటరన్‌ స్పిన్నర్‌ అమిత్‌ మిశ్రా (42) క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు. 25 ఏళ్ల కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్టు మిశ్రా గురువారం సోషల్‌ మీడియాలో తెలిపాడు. హరియాణాకు చెందిన మిశ్రా చివరిసారిగా 2017లో బెంగళూరులో ఇంగ్లండ్‌తో టీ20 మ్యాచ్‌ ఆడాడు. 2024దాకా ఐపీఎల్‌లో ఆడిన మిశ్రా ఇకపై అన్ని ఫార్మాట్‌లకు గుడ్‌బై చెబుతున్నట్టు తెలిపాడు. 2003లో ఢాకాలో సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో మిశ్రా వన్డేల్లో అరంగేట్రం చేశాడు. 2008లో ఆస్ట్రేలియాతో ఆడిన తన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తాచాటాడు. 2010లో జింబాబ్వేతో మ్యాచ్‌తో టీ20ల్లోకి అడుగుపెట్టాడు. భారత్‌ తరఫున 22 టెస్ట్‌లు, 36 వన్డేలు, 10 టీ20లలో ప్రాతినిథ్యం వహించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 156, ఐపీఎల్‌లో 166 వికెట్లు సాధించాడు.

Updated Date - Sep 05 , 2025 | 02:45 AM