Share News

Varun Chakravarthy: రోజుకు రూ. 600 కూలి నుంచి..

ABN , Publish Date - Jul 01 , 2025 | 03:07 AM

వరుణ్‌ చక్రవర్తి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మిస్టరీ స్పిన్నర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఐపీఎల్‌లో మెరిసిన 33 ఏళ్ల వరుణ్‌.. టీమిండియా చాంపియన్‌ ట్రోఫీ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు.

Varun Chakravarthy: రోజుకు రూ. 600 కూలి నుంచి..

  • మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి

రుణ్‌ చక్రవర్తి.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మిస్టరీ స్పిన్నర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించాడు. ఐపీఎల్‌లో మెరిసిన 33 ఏళ్ల వరుణ్‌.. టీమిండియా చాంపియన్‌ ట్రోఫీ నెగ్గడంలో కీలకపాత్ర పోషించాడు. అయితే, వరుణ్‌ గతం మాత్రం ఎంతో విచిత్రం. గిటారిస్ట్‌, ఫిల్మ్‌మేకర్‌, ఆర్కిటెక్చర్‌గా పలు వృత్తుల్లో ప్రయత్నించిన చక్రవర్తి.. ఆఖరికి క్రికెటర్‌గా సెటిలయ్యాడు. ఒకప్పుడు సినిమాల్లో జూనియర్‌ ఆర్టి్‌స్టగా రోజుకు రూ. 600 కూలీకి పనిచేసిన వరుణ్‌, ఇప్పుడు ఐపీఎల్‌ వేలంలో రూ. 12 కోట్లు పలికి కోటీశ్వరుడయ్యాడు. ఇలా.. తన జీవితంలో నమ్మశక్యం కాని ఆసక్తికర విషయాలను అశ్విన్‌ యూట్యూబ్‌ చానెల్‌లో వరుణ్‌ పంచుకొన్నాడు. ఇంజినీరింగ్‌ తర్వాత రూ. 14 వేల జీతానికి ఆర్కిటెక్చర్‌ కంపెనీలో చేరినట్టు తెలిపాడు. తర్వాత క్రికెట్‌ థీమ్‌తో తమిళంలో నిర్మించిన ‘జీవా’ సినిమాలో నటించినట్టు చెప్పాడు. అంతేకాదు.. తమిళ నటుడు విజయ్‌కు తాను వీరాభిమానినని తెలిపాడు. కెరీర్‌ ముగిసిన తర్వాత విజయ్‌తో సినిమాను డైరెక్ట్‌ చేయాలనుకొంటున్నట్టు చెప్పాడు.

Updated Date - Jul 01 , 2025 | 03:09 AM