వైభవ్ ధనాధన్
ABN , Publish Date - Jul 03 , 2025 | 04:39 AM
యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 86) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో మూడో వన్డేలో భారత్ అండర్-19 జట్టు 4 వికెట్ల తేడాతో...
మూడో వన్డేలో భారత యువ జట్టు గెలుపు
నార్తాంప్టన్: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ (31 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 86) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగడంతో మూడో వన్డేలో భారత్ అండర్-19 జట్టు 4 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ అండర్-19 జట్టుపై గెలిచింది. వర్షం కారణంగా ఆలస్యంగా మొదలైన ఈ మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్.. కనిష్క్ చౌహాన్ (3/30) ధాటికి 40 ఓవర్లలో 268/6 స్కోరు చేసింది. కెప్టెన్ థామస్ రే (76 నాటౌట్), ఓపెనర్ డాకిన్స్ (62) అర్ధ సెంచరీలు చేశారు. ఛేదనలో ఓపెనర్ వైభవ్‌కు తోడు విహాన్ (46), కనిష్క్ (43 నాటౌట్) సత్తా చాటడంతో భారత జట్టు 34.3 ఓవర్లలోనే 274/6 స్కోరు చేసి గెలిచింది. దీంతో ఐదు వన్డేల ఈ సిరీ్‌సలో భారత్ 2-1తో ఆధిక్యంలో నిలిచింది. తొలి వన్డేలో భారత్, రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలిచాయి.
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి