Share News

IPL Opening Batsman: వైభవ్‌ వల్లే వెళుతున్నాడు

ABN , Publish Date - Aug 10 , 2025 | 05:37 AM

రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ పాతుకుపోవడంతోనే సంజూ శాంసన్‌ జట్టును వీడాలనుకుంటున్నట్టు టీమిండియా మాజీ ఆటగాడు...

IPL Opening Batsman: వైభవ్‌ వల్లే వెళుతున్నాడు

  • సంజూ శాంసన్‌పై ఆకాశ్‌ చోప్రా

న్యూఢిల్లీ: రాజస్థాన్‌ రాయల్స్‌ ఓపెనర్‌గా 14 ఏళ్ల వైభవ్‌ సూర్యవంశీ పాతుకుపోవడంతోనే సంజూ శాంసన్‌ జట్టును వీడాలనుకుంటున్నట్టు టీమిండియా మాజీ ఆటగాడు ఆకాశ్‌ చోప్రా చెబుతున్నాడు. శాంసన్‌కు ఓపెనింగ్‌లో ఆడాలని ఇష్టమున్నా.. గత సీజన్‌లో అతడిని మూడో స్థానంలో పంపారు. ఇక.. యశస్వీ జైస్వాల్‌, వైభవ్‌లను ఓపెనర్లుగా ఆడించారు. ‘గత మెగా వేలంలో రాజస్థాన్‌ జట్టు ఓపెనర్‌ బట్లర్‌ను వదులుకుంది. దీంతో జైస్వాల్‌కు జతగా శాంసన్‌ ఓపెనింగ్‌ చేయాలనుకున్నాడు. ఈ ఏడాది సీజన్‌ ఆరంభంలో కొన్ని మ్యాచ్‌ల్లోనూ అతను ఓపెనర్‌గా ఆడాడు. అయితే సంజూకు గాయమవడంతో వైభవ్‌ను ఆడించారు. తిరిగి శాంసన్‌ జట్టులోకి వచ్చినా వైభవ్‌నే ఓపెనర్‌గా కొనసాగించారు. ఇది సంజూకు ఇష్టం లేకపోయింది’ అని ఆకాశ్‌ వివరించాడు.

Updated Date - Aug 10 , 2025 | 05:39 AM