Unnati Huda and Kiran George emerged victorious: ఉన్నతి, కిరణ్‌కు టైటిళ్లు
ABN , Publish Date - Dec 15 , 2025 | 03:06 AM
ఒడిశా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో ఉన్నతి హుడా, కిరణ్ జార్జ్ విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో....
ఒడిశా మాస్టర్స్ బ్యాడ్మింటన్
కటక్: ఒడిశా మాస్టర్స్ సూపర్ 100 బ్యాడ్మింటన్ టోర్నీలో ఉన్నతి హుడా, కిరణ్ జార్జ్ విజేతలుగా నిలిచారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో ఉన్నతి 21-17, 21-10తో భారత్‌కే చెందిన ఇషారాణి బారువాను ఓడించి టైటిల్ దక్కించుకుంది. హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ తుదిపోరులో కిరణ్ 21-14, 13-21, 21-16తో మహ్మద్ యూసుఫ్ (ఇండోనేసియా)పై నెగ్గి చాంపియన్‌గా నిలిచాడు. మహిళల డబుల్స్ ఫైనల్లో గాబ్రియెలా/ స్టెఫానీ (బల్గేరియా) జోడీ 21-19, 21-14తో ఆంగ్ జిన్/కార్మెన్ టింగ్ (మలేసియా) ద్వయంపై గెలిచింది. పురుషుల డబుల్స్‌లో అలీ/డెవిన్ (ఇండోనేసియా) జంట 15-21, 21-12, 21-16తో ఖాంగ్/ఆరోన్ (మలేసియా) జోడీపై నెగ్గింది.