Share News

‘బ్యాట్‌’ పరీక్షలో నరైన్‌, నోకియా విఫలం

ABN , Publish Date - Apr 17 , 2025 | 03:11 AM

ఐపీఎల్‌లో ఫీల్డ్‌లో బ్యాట్‌ చెకింగ్‌ నిబంధనతో కోల్‌కతా బ్యాటర్‌ సునీల్‌ నరైన్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం పంజాబ్‌తో మ్యాచ్‌లో ఛేదనకు ముందు బౌండ్రీ అవతల నరైన్‌, రఘువంశీ బ్యాట్లను...

‘బ్యాట్‌’ పరీక్షలో నరైన్‌, నోకియా విఫలం

న్యూఢిల్లీ: ఐపీఎల్‌లో ఫీల్డ్‌లో బ్యాట్‌ చెకింగ్‌ నిబంధనతో కోల్‌కతా బ్యాటర్‌ సునీల్‌ నరైన్‌కు చేదు అనుభవం ఎదురైంది. మంగళవారం పంజాబ్‌తో మ్యాచ్‌లో ఛేదనకు ముందు బౌండ్రీ అవతల నరైన్‌, రఘువంశీ బ్యాట్లను రిజర్వు అంపైర్‌ సయ్యద్‌ ఖలీద్‌ బ్యాట్‌ గేజ్‌తో పరీక్షించాడు. ఇందులో నరైన్‌ బ్యాట్‌ విఫలం కాగా.. రఘువంశీ బ్యాట్‌ పాసైంది. దీంతో బ్యాట్‌ను మార్చాల్సిందిగా నరైన్‌కు అంపైర్‌ సూచించాడు. కాగా, 16వ ఓవర్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన నోకియా బ్యాట్‌ను ఫీల్డ్‌ అంపైర్‌ పరీక్షించి తిరస్కరించాడు. దీంతో రిజర్వు ప్లేయర్‌తో హడావిడిగా మరో బ్యాట్‌ను తెప్పించుకొన్నాడు. ఇలా ఇద్దరు కోల్‌కతా ఆటగాళ్లు తమ బ్యాట్లను మార్చాల్సి వచ్చింది. గతంలో డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఇలా బ్యాట్లు నిర్ణీత ప్రమాణాల ప్రకారం ఉన్నాయా? లేదా? అని చెక్‌ చేసేవారు. కానీ, గత ఆదివారం నుంచి మైదానంలోనే పరీక్షించడం ఆరంభించారు.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 17 , 2025 | 03:11 AM