Share News

Umpire Dharmasena : అంపైర్‌ ధర్మసేనపై ఫైర్‌..

ABN , Publish Date - Aug 01 , 2025 | 06:28 AM

ఇంగ్లండ్‌కు లబ్ధి చేకూర్చేలా ఫీల్డ్‌ అంపైర్‌ కుమార ధర్మసేన వ్యవహరించాడంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. టంగ్‌ విసిరిన

Umpire Dharmasena : అంపైర్‌ ధర్మసేనపై ఫైర్‌..

ఇంగ్లండ్‌కు లబ్ధి చేకూర్చేలా ఫీల్డ్‌ అంపైర్‌ కుమార ధర్మసేన వ్యవహరించాడంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. టంగ్‌ విసిరిన ఇన్నింగ్స్‌13వ ఓవర్‌ రెండో బంతి సుదర్శన్‌ ప్యాడ్‌ను తాకింది. ఎల్బీ కోసం ఇంగ్లండ్‌ అప్పీలు చేసినా.. ధర్మసేన తోసిపుచ్చాడు. అంతవరకు ఆగకుండా...బంతి ప్యాడ్‌కు తాకేముందు బ్యాట్‌కు ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుందంటూ వేళ్ల ద్వారా సూచించాడు. దీంతో ఇంగ్లండ్‌ రివ్యూకు వెళ్లే ఆలోచనను విరమించుకొంది. ఇలా ఆతిథ్య జట్టుకు ధర్మసేన ఒక రివ్యూ మిగిల్చేందుకు సహకరించాడని నెటిజన్లు తప్పుబడుతున్నారు.

Updated Date - Aug 01 , 2025 | 06:28 AM