Share News

UAE cricket: యూఏఈకి టీ20 ప్రపంచ కప్‌ బెర్త్‌

ABN , Publish Date - Oct 17 , 2025 | 04:07 AM

యూఏఈ జట్టు వచ్చే ఏడాది జరిగే పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించింది. ఆసియా-ఈఏపీ క్వాలిఫయర్స్‌ టోర్నీలో భాగంగా గురువారం...

UAE cricket: యూఏఈకి టీ20 ప్రపంచ కప్‌ బెర్త్‌

దుబాయ్‌: యూఏఈ జట్టు వచ్చే ఏడాది జరిగే పురుషుల టీ20 వరల్డ్‌ కప్‌కు అర్హత సాధించింది. ఆసియా-ఈఏపీ క్వాలిఫయర్స్‌ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో యూఏఈ ఎనిమిది వికెట్లతో జపాన్‌ను ఓడించింది. దాంతో ఈ టోర్నీ లో నేపాల్‌, ఒమన్‌తో కలిసి మూడో జట్టుగా యూఏఈ టిక్కెట్‌ దక్కించుకుంది. యూఏఈ ఎంట్రీతో ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే మొత్తం 20 జట్లూ ఖరారయ్యాయి. 2026 ఫిబ్రవరి-మార్చిలో జరిగే ఈ వరల్డ్‌కప్‌నకు భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్నాయి.

Updated Date - Oct 17 , 2025 | 04:07 AM