Lionel Messi Special Event: మెస్సీ ఈవెంట్ టిక్కెట్ల విక్రయం షురూ
ABN , Publish Date - Nov 29 , 2025 | 03:11 AM
ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ ఈవెంట్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. వచ్చే నెల 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ ఈవెంట్‌కు సంబంధించి డిస్ట్రిక్ జొమాటో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ ఈవెంట్ టిక్కెట్ల విక్రయం ప్రారంభమైంది. వచ్చే నెల 13వ తేదీన ఉప్పల్ స్టేడియంలో జరిగే ఈ ఈవెంట్‌కు సంబంధించి డిస్ట్రిక్ జొమాటో యాప్, వెబ్‌సైట్‌లో గురువారం టిక్కెట్ల అమ్మకాలు మొదలయ్యాయి. ఉప్పల్ స్టేడియంలో సెలబ్రెటీ ఫుట్‌బాల్ మ్యాచ్, మెస్సీకి సన్మానం, సంగీత విభావరి నిర్వహించనున్నారు. టిక్కెట్ల ధరల విషయానికొస్తే రూ.1750 నుంచి రూ.30 వేల శ్రేణి వరకు ఉన్నాయి. రూ.2 వేలు, 3,250, 5 వేలు, 7 వేలు, 8 వేలు, 13,500 రకాల టిక్కెట్లను ప్రస్తుతం అమ్మకానికి ఉంచారు. ఇందులో రూ.30 వేల శ్రేణి టిక్కెట్లకు హాస్పిటాలిటీ సదుపాయం ఉంది.