Tickets for Visakhapatnam ODI: 28 నుంచి విశాఖ వన్డే టికెట్ల విక్రయం
ABN , Publish Date - Nov 23 , 2025 | 06:41 AM
దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా జరిగే ఆఖరి మ్యాచ్‌కు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. వచ్చే నెల 6వ తేదీన జరిగే ఈ మ్యాచ్...
విశాఖపట్నం (స్పోర్ట్స్): దక్షిణాఫ్రికాతో భారత్ మూడు వన్డేల సిరీ్‌సలో భాగంగా జరిగే ఆఖరి మ్యాచ్‌కు విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ఆతిథ్యం ఇస్తోంది. వచ్చే నెల 6వ తేదీన జరిగే ఈ మ్యాచ్ టిక్కెట్లను ఈనెల 28 నుంచి డిస్ట్రిక్ట్ జొమాటో యాప్‌లో విక్రయించనున్నారు. మొత్తం 22 వేల టిక్కెట్లను విక్రయానికి ఉంచినట్టు ఏసీఏ తెలిపింది. టిక్కెట్ల ప్రారంభ ధర రూ.1,200 కాగా, గరిష్టంగా రూ.18 వేలుగా నిర్ణయించారు. వీటితో పాటు రూ. 2,000, 2,500, 3,000, 3,500, 4 వేలు, 5 వేలు, 10 వేలు, 15 వేలు, 18 వేల శ్రేణి టిక్కెట్లు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి
ఐబొమ్మ రవి కేసు.. మరో కీలక పరిణామం
ఇండియా, పాకిస్తాన్ యుద్ధం.. చైనా తెలివి మామూలుగా లేదుగా..