సెమీస్ లో నిఖత్
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:37 AM
జాతీయ ఎలీట్ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్‌లో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌తో సహా ముగ్గురు తెలంగాణ బాక్సర్లు సెమీఫైనల్లోకి...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ ఎలీట్ మహిళల బాక్సింగ్ టోర్నమెంట్‌లో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్‌తో సహా ముగ్గురు తెలంగాణ బాక్సర్లు సెమీఫైనల్లోకి ప్రవేశించారు. ఆదివారం సరూర్‌నగర్ స్టేడియంలో జరిగిన రెండో రోజు పోటీల్లో 48-51 కిలోల విభాగంలో నిఖత్ 5-0తో కల్పన (సాయ్)పై తిరుగులేని విజయం సాధించి పతకానికి చేరువైంది. 57-60 కి., కేటగిరీలో జి. నిహారిక 5-0తో ప్రియాంక (చండీగఢ్)పై, 60-65 కి., విభాగంలో యషి శర్మ 3-2తో సరిత రాయ్ (ఉత్తరప్రదేశ్)పై నెగ్గి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నారు. 45-48 కి., మంజు రాణి, 70-75 కి., లవ్లీనా తమ బౌట్లలో గెలిచి, ముందంజ వేశారు.
ఇవీ చదవండి:
గతాన్ని తలచుకొని వరుణ్ ఎమోషనల్!
ఇండో-పాక్ ఫైట్.. తేదీ గుర్తుపెట్టుకోండి!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి