ఒలింపిక్ స్వర్ణానికి రూ 6 కోట్లు
ABN , Publish Date - Jun 25 , 2025 | 01:26 AM
తెలంగాణ ప్రభుత్వ కొత్త క్రీడా పాలసీలో నగదు ప్రోత్సాహకాలను భారీగా పెంచారు. గతంలో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తే ఇచ్చే రూ 2 కోట్లను తాజా పాలసీలో రూ 6 కోట్లకు...
రాష్ట్ర విజేతలకిచ్చే ప్రోత్సాహకాలు భారీగా పెంపు
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): తెలంగాణ ప్రభుత్వ కొత్త క్రీడా పాలసీలో నగదు ప్రోత్సాహకాలను భారీగా పెంచారు. గతంలో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధిస్తే ఇచ్చే రూ.2 కోట్లను తాజా పాలసీలో రూ.6 కోట్లకు, ఆసియా క్రీడల్లో పసిడి పతకం గెలిస్తే ఇచ్చే రూ.30 లక్షలను రూ.3 కోట్లకు గణనీయంగా పెంచారు. ఇకపై ఒలింపిక్స్‌లో రజతానికి రూ.4 కోట్లు, కాంస్యానికి రూ.2 కోట్లు, ఆసియా క్రీడల్లో రజతానికి రూ. కోటిన్నర, కాంస్యానికి రూ.75 లక్షలు ఇవ్వనున్నారు. కామన్వెల్త్ క్రీడలకు గతంలో స్వర్ణానికి రూ.25 లక్షలు ఉండగా, తాజాగా రూ. కోటిన్నరకు పెంచారు. రజతానికి రూ.75 లక్షలు, కాంస్యానికి రూ.50 లక్షలు అందిస్తారు. సాధారణ క్రీడాకారులతో సమానంగా ఎలాంటి వ్యత్యాసం లేకుండా పారా అథ్లెట్లకు కూడా ఇవే నగదు బహుమతులను అందించనున్నామని శాట్ చైర్మన్ శివసేనారెడ్డి చెప్పారు. అంతర్జాతీయ పోటీల్లో నిలకడగా రాణిస్తున్న క్రీడాకారులను గుర్తించి వారికి ప్రత్యేకంగా ఆర్థిక, శిక్షణ పరంగా సహాయం అందించేందుకు కాంపిటేటివ్ అండ్ హైపెర్ఫామెన్స్ స్పోర్ట్స్ బోర్డును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
ఇవీ చదవండి:
గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు!
లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న దూబె
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి