Share News

Meets King Charles III: కింగ్‌తో టీమిండియా

ABN , Publish Date - Jul 16 , 2025 | 03:29 AM

ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత పురుషుల, మహిళల క్రికెట్‌ జట్లు బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3ని మర్యాద పూర్వకంగా కలిశాయి. మంగళవారం క్లారెన్స్‌ హౌస్‌ గార్డెన్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ఆయనతో కలిసి...

Meets King Charles III: కింగ్‌తో టీమిండియా

లండన్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత పురుషుల, మహిళల క్రికెట్‌ జట్లు బ్రిటన్‌ రాజు చార్లెస్‌-3ని మర్యాద పూర్వకంగా కలిశాయి. మంగళవారం క్లారెన్స్‌ హౌస్‌ గార్డెన్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు ఆయనతో కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. అలాగే కెప్టెన్‌ గిల్‌, పేసర్లు బుమ్రా, అర్ష్‌దీప్‌, ప్రసిద్ధ్‌ తదితర ఆటగాళ్లతో కింగ్‌ ముచ్చటించారు. అంతేకాకుండా లార్డ్స్‌లో జరిగిన మూడో టెస్టు హైలైట్స్‌ను తాను చూసినట్టు ప్లేయర్లతో కింగ్‌ చార్లెస్‌ అన్నారు. ‘బ్రిటన్‌ కింగ్‌ను కలుసుకోవడం ఆనందంగా ఉంది. అందరితో ఆయన ఆప్యాయంగా మాట్లాడారు. అలాగే చివరి రోజు ఆటలో సిరాజ్‌ అవుటైన విధానం దురదృష్టకరమని, బంతి పక్క నుంచి వెళ్లి స్టంప్స్‌ను తాకిందని మాతో అన్నారు’ అని గిల్‌ వివరించాడు.

నాలుగో టెస్టుకు మార్పులు!

నాలుగో టెస్టు కోసం భారత జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. పని ఒత్తిడిలో భాగంగా పేసర్‌ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే అతడి స్థానంలో లెఫ్టామ్‌ పేసర్‌ అర్ష్‌దీప్‌ జట్టులోకి రావచ్చు. అలాగే చేతి వేలి గాయంతో ఇబ్బందిపడుతున్న వికెట్‌ కీపర్‌ పంత్‌ స్థానంలో ధ్రువ్‌ జురెల్‌ను ఆడించే చాన్సుంది. ఇక వరుసగా మూడు టెస్టుల్లోనూ విఫలమైన కరుణ్‌ నాయర్‌ను తప్పించి సాయి సుదర్శన్‌ను తుది జట్టులోకి తీసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. లార్డ్స్‌లో పేసర్‌ ఆకాశ్‌ కేవలం ఒకే వికెట్‌ తీసినా అతడి స్థానానికి ఢోకా ఉండకపోవచ్చు.

ఇవీ చదవండి:

లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..

ఎంత పని చేశావ్ ఆర్చర్?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 16 , 2025 | 03:29 AM