Share News

బంతి మారిందోచ్‌

ABN , Publish Date - Jun 25 , 2025 | 01:10 AM

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ బంతి ఆకారంపై భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో బంతిని మార్చాలంటూ ఆఖరి రోజు తొలి సెషన్‌లో గిల్‌...

బంతి మారిందోచ్‌

ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లోనూ బంతి ఆకారంపై భారత్‌ అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో బంతిని మార్చాలంటూ ఆఖరి రోజు తొలి సెషన్‌లో గిల్‌, సిరాజ్‌, రాహుల్‌, జడేజా, శార్దూల్‌ అంపైర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే గాగ్‌ టెస్టులో బాగానే ఉండడంతో దాంతోనే ఆటను కొనసాగించారు. పదేపదే ఇదే విషయం అడుగుతుండడంతో అటు ప్రేక్షకులు సైతం భారత ఆటగాళ్లను గేలి చేశారు. ఎట్టకేలకు 27వ ఓవర్‌ ముగిశాక బంతి గాగ్‌ టెస్టులో విఫలం కావడంతో భారత్‌ కోరిక తీరింది. దీంతో కీపర్‌ పంత్‌ సంతోషంతో గట్టిగా ‘ఎస్‌..’ అని అరవగా.. తర్వాతి ఓవర్‌ వేసేందుకు వచ్చిన జడేజా పిడికిలి బిగించి అంపైర్‌ దగ్గరకు వెళ్లి మరీ సంబరాలు చేసుకోవడం కనిపించింది. దీన్ని అంపైర్‌ గఫానే కూడా సరదాగా తీసుకున్నాడు.

ఇవీ చదవండి:

గిల్ సేనను భయపెడుతున్న పేస్ పిచ్చోడు!

టీమిండియాను వదలని డకెట్

లగ్జరీ అపార్ట్‌మెంట్స్ కొన్న దూబె

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 01:10 AM