Team India: క్లీన్‌స్వీప్ లక్ష్యంగా..
ABN , Publish Date - Oct 10 , 2025 | 02:47 AM
వెస్టిండీ్‌సతో జరిగిన తొలి టెస్టును పూర్తి ఏకపక్షంగా మార్చేసి మూడు రోజుల్లోపే ముగించిన టీమిండియా.. ఇప్పుడు క్లీన్‌స్వీ్‌పపై కన్నేసింది...
బరిలోకి టీమిండియా జూ నేటి నుంచి విండీ్‌సతో రెండో టెస్టు
న్యూఢిల్లీ: వెస్టిండీ్‌సతో జరిగిన తొలి టెస్టును పూర్తి ఏకపక్షంగా మార్చేసి మూడు రోజుల్లోపే ముగించిన టీమిండియా.. ఇప్పుడు క్లీన్‌స్వీ్‌పపై కన్నేసింది. శుక్రవారం నుంచి ఇరు జట్ల మధ్య ఆఖరిదైన రెండో టెస్టు జరుగనుంది. గతమెంతో ఘనమైన కరీబియన్ టీమ్ భారత జట్టుతో ఏ విభాగంలోనూ సరితూగే స్థాయిలో లేదు. దీంతో ఈ టెస్టులోనూ గిల్ సేనకు పెద్దగా పోటీ ఉండకపోవచ్చు. అయితే తమ జట్టుకు పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్న దిగ్గజ ఆటగాళ్లు లారా, రిచర్డ్స్, రిచర్డ్‌సన్ మ్యాచ్‌కు ముందు విండీస్ ఆటగాళ్లతో సంభాషించి వారిలో ఉత్తేజాన్ని నింపనున్నారు. తొలి టెస్టులోని రెండు ఇన్నింగ్స్‌లలో కలిపినా విండీస్ బ్యాటర్లు కనీసం 90 ఓవర్లు ఆడలేకపోయారు. అలాగే ఒక్కరు కూడా హాఫ్ సెంచరీ సాధించలేదు. 2002లో భారత్‌పై చివరి విజయం సాధించిన విండీస్ తాజా టెస్టులో ఏమేరకు పోటీనిస్తుందో వేచి చూడాల్సిందే. ఇక అరుణ్ జైట్లీ మైదానంలో భారత్ 1987లో చివరిసారిగా టెస్టు మ్యాచ్‌లో ఓడింది.
మార్పుల్లేకుండానే..: అన్ని విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న టీమిండియా తమ తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు. అయితే సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ బ్యాటింగ్‌పై ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉంది. తొలి టెస్టులో కేవలం నాలుగు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన నితీశ్‌కు బ్యాటింగ్ చేసే చాన్స్ రాలేదు. అందుకే ఈ టెస్టులో అతడిని ముందుగా పంపే అవకాశం ఉంది. ఇక తొలి టెస్టులో టాపార్డర్‌తో పాటు మిడిలార్డర్ అద్భుతంగా ఆడినా వన్‌డౌన్‌లో సాయి సుదర్శన్ మాత్రం ఏడు పరుగులకే పరిమితమయ్యాడు. రాహుల్, జురెల్, జడేజా శతకాలతో ఫామ్‌ను చాటుకోగా.. గిల్, జైస్వాల్ కూడా రాణించారు. బౌలింగ్‌లో పేసర్లు బుమ్రా, సిరాజ్ అదుర్స్ అనిపించుకున్నారు. కుల్దీప్, సుందర్ స్పిన్‌లో ప్రభావం చూపుతున్నారు.
