Share News

థాయ్‌లాండ్‌ లో శ్రీకాంత్‌కు తరుణ్‌ షాక్‌

ABN , Publish Date - May 14 , 2025 | 04:04 AM

బ్యాంకాక్‌: ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న కిడాంబి శ్రీకాంత్‌కు మరో టోర్నీలోనూ నిరాశే ఎదురైంది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో ఏకంగా క్వాలిఫయింగ్‌ రౌండ్‌లోనే...

థాయ్‌లాండ్‌ లో శ్రీకాంత్‌కు తరుణ్‌ షాక్‌

బ్యాంకాక్‌: ఫామ్‌లేమితో ఇబ్బంది పడుతున్న కిడాంబి శ్రీకాంత్‌కు మరో టోర్నీలోనూ నిరాశే ఎదురైంది. థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో ఏకంగా క్వాలిఫయింగ్‌ రౌండ్‌లోనే వెనుదిరిగాడు. సింగిల్స్‌ క్వాలిఫయింగ్‌ ఆరంభ రౌండ్లో తెలుగు షట్లర్‌ తరుణ్‌ మన్నేపల్లి 21-6, 21-19తో ప్రపంచ మాజీ నెంబర్‌వన్‌ కిడాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చాడు. ఆ తర్వాత తదుపరి రౌండ్లో తరుణ్‌ 17-21, 21-19, 21-17తో కువో కాన్‌ లిన్‌ (తైపీ)ని ఓడించి మెయిన్‌ డ్రాకు అర్హత సాధించాడు. భారత షట్లర్‌ ఐరా శర్మ 18-21, 21-12, 21-8తో తెట్‌ తార్‌ తుజార్‌ (మయన్మార్‌)పై గెలిచి మహిళల సింగిల్స్‌లో మెయిన్‌ డ్రాకు చేరుకుంది.

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 14 , 2025 | 04:04 AM