Share News

Macau Open: తరుణ్‌ లక్ష్య ముందంజ

ABN , Publish Date - Jul 31 , 2025 | 05:14 AM

తెలుగు యువ షట్లర్‌ తరుణ్‌ మన్నెపల్లి మకావు ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. తరుణ్‌తో పాటు స్టార్‌ ఆటగాడు లక్ష్యసేన్‌, ఆయుష్‌ శెట్టి కూడా...

Macau Open: తరుణ్‌ లక్ష్య ముందంజ

మకావు ఓపెన్‌లో ప్రణయ్‌కు షాక్‌

మకావు: తెలుగు యువ షట్లర్‌ తరుణ్‌ మన్నెపల్లి మకావు ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేశాడు. తరుణ్‌తో పాటు స్టార్‌ ఆటగాడు లక్ష్యసేన్‌, ఆయుష్‌ శెట్టి కూడా ముందంజ వేశారు. సింగిల్స్‌ ఆరంభ రౌండ్లో తరుణ్‌ 21-19, 21-13తో సహచరుడు మన్‌రాజ్‌ సింగ్‌పై, లక్ష్య 21-8, 21-14తో జియోన్‌ హ్యూక్‌ జిన్‌ (కొరియా)పై, ఆయుష్‌ 21-10, 21-11తో హువాంగ్‌ యు కాయి (తైపీ)పై గెలిచారు. ప్రణయ్‌ 21-18, 15-21, 15-21తో యొహానెస్‌ (ఇండోనేసియా) చేతిలో కంగుతిన్నాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ధ్రువ్‌ కపిల/తనీషా క్రాస్టో 21-10, 21-15తో థాయ్‌ జంట రచాపోల్‌/నటామోన్‌ను ఓడించగా, మహిళల సింగిల్స్‌లో ఉన్నతి హుడా తొలిరౌండ్లోనే వెనుదిరిగింది.

ఇవి కూడా చదవండి..

మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 31 , 2025 | 05:14 AM