Syed Modi International: ఒకుహరాకు తన్వీ షాక్
ABN , Publish Date - Nov 28 , 2025 | 06:19 AM
ప్రపంచ జూనియర్ చాంపియన్‌షి్‌ప్స రజత పతక విజేత తన్వీ శర్మ తన కెరీర్‌లోనే గొప్ప విజయం సాధించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో ప్రపంచ మాజీ చాంపియన్ నవోమి ఒకుహరాకు తన్వీ షాకిచ్చింది...
సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్
లఖ్‌నవూ: ప్రపంచ జూనియర్ చాంపియన్‌షి్‌ప్స రజత పతక విజేత తన్వీ శర్మ తన కెరీర్‌లోనే గొప్ప విజయం సాధించింది. సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీలో ప్రపంచ మాజీ చాంపియన్ నవోమి ఒకుహరాకు తన్వీ షాకిచ్చింది. గురువారం జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్‌లో 16 ఏళ్ల తన్వీ 13-21, 21-16, 21-19తో రెండో సీడ్ ఒకుహరా (జపాన్)ని చిత్తు చేసింది. 19 ఏళ్ల మన్‌రాజ్.. ప్రణయ్‌ని కంగుతినిపించి రౌండ్-8కి చేరాడు. మరో మ్యాచ్‌లో కిడాంబి శ్రీకాంత్-సనీత్ దయానంద్‌ని ఓడించి క్వార్టర్స్‌లో ప్రవేశించాడు. ఆరోసీడ్ తరుణ్ మన్నేపల్లి 16-21, 21-17, 17-21తో మిథున్ మంజునాథ్ చేతిలో ఓడాడు. పురుషుల డబుల్స్‌లో అర్జున్/హరిహరన్, మహిళల డబుల్స్‌లో గాయత్రి/ట్రీసా జంటలు కూడా క్వార్టర్‌ఫైనల్లోకి అడుగుపెట్టాయి.
ఇవి కూడా చదవండి:
బీబీ లీగ్‌కు జెమీమా దూరం.. స్మృతి కోసమే!
కోచ్ పదవిపై ఏ నిర్ణయమూ తీసుకోలేదు.. స్పష్టం చేసిన బీసీసీఐ