ఫైనల్లో తన్వీ ఆయుష్
ABN , Publish Date - Jun 30 , 2025 | 04:29 AM
భారత వర్ధమాన షట్లర్లు తన్వీ శర్మ, ఆయుష్ షెట్టి యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ్‌సలో 16 ఏళ్ల తన్వీ...
యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్
లోవా (యూఎస్): భారత వర్ధమాన షట్లర్లు తన్వీ శర్మ, ఆయుష్ షెట్టి యూఎస్ ఓపెన్ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీ్‌సలో 16 ఏళ్ల తన్వీ 21-14, 21-16తో ఏడో సీడ్ పోలినా (ఉక్రెయిన్)పై విజయం సాధించింది. తుది పోరులో బివిన్ జాంగ్‌తో తన్వీ అమీతుమీ తేల్చుకోనుంది. పురుషుల సింగిల్స్ సెమీ్‌సలో ఆయుష్ 21-23, 21-15, 21-14తో టాప్ సీడ్ చో టిన్ చెన్ (చైనీస్ తైపీ)పై పోరాడి గెలిచాడు. ఫైనల్లో మూడో సీడ్ బ్రియాన్ యంగ్‌తో ఆయుష్ తలపడనున్నాడు.
ఇవీ చదవండి:
గతాన్ని తలచుకొని వరుణ్ ఎమోషనల్!
ఇండో-పాక్ ఫైట్.. తేదీ గుర్తుపెట్టుకోండి!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి