Unnati Hooda: టైటిల్ చేరువలో ఉన్నతి
ABN , Publish Date - May 10 , 2025 | 05:20 AM
తైపీ ఓపెన్ సూపర్ 300 టోర్నీలో భారత షట్లర్లు ఆయుష్ శెట్టి, ఉన్నతి హుడా సెమీఫైనల్స్‌కు ప్రవేశించారు. ఫైనల్ చేరిక కోసం టాప్‌సీడ్ ప్రత్యర్థులతో పోటీ పడనున్నారు.

తైపీ ఓపెన్ సెమీస్‌కు ఆయుష్
తైపీ: భారత యువ షట్లర్లు ఆయుష్ శెట్టి, ఉన్నతి హుడా తైపీ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్‌లో సింగిల్స్‌లో సెమీఫైనల్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల క్వార్టర్‌ఫైనల్లో 20 ఏళ్ల ఆయుష్ 16-21, 21-19తో ఏడోసీడ్ బ్రయాన్ యాంగ్ (కెనడా)పై, మహిళల క్వార్టర్స్‌లో 17 ఏళ్ల ఉన్నతి 21-8, 19-21, 21-19తో స్థానిక షట్లర్ హంగ్ యి తింగ్‌పై గెలిచారు. ఫైనల్లో బెర్త్ కోసం టాప్‌సీడ్ టొమొక మియాజాకి (జపాన్)తో ఉన్నతి, టాప్‌సీడ్ చో తిన్ చెన్ (తైపీ)తో ఆయుష్ తలపడతారు