Share News

ఇంగ్లండ్‌కు సూర్యకుమార్‌

ABN , Publish Date - Jun 19 , 2025 | 03:38 AM

టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంగ్లండ్‌ వెళ్లాడు. స్పోర్ట్స్‌ హెర్నియా (గజ్జల్లో లేదా పొత్తి కడుపులో నొప్పి) సంబంధిత గాయానికి...

ఇంగ్లండ్‌కు సూర్యకుమార్‌

న్యూఢిల్లీ: టీమిండియా టీ20 సారథి సూర్యకుమార్‌ యాదవ్‌ ఇంగ్లండ్‌ వెళ్లాడు. స్పోర్ట్స్‌ హెర్నియా (గజ్జల్లో లేదా పొత్తి కడుపులో నొప్పి) సంబంధిత గాయానికి చికిత్స కోసం అతను ఇంగ్లండ్‌ వెళ్లినట్టు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించాడు. అవసరమైతే సూర్య తన గాయానికి శస్త్రచికిత్స కూడా చేయించుకునే అవకాశముందని తెలిపాడు. ఐపీఎల్‌ ముగిశాక సూర్య ముంబై టీ20 టోర్నీలో ఆడాడు. ఆ టోర్నీ సందర్భంగా అతనికి నొప్పి తీవ్రమైనట్టు సమాచారం. ‘గాయానికి చికిత్స తీసుకోవడానికి ఇదే సరైన సమయమని సూర్య భావించాడు. చికిత్స అనంతరం పునరావాసం కోసం అతను బెంగళూరులోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో చేరనున్నాడు’ అని బీసీసీఐ అధికారి పేర్కొన్నాడు.

ఇవీ చదవండి:

పిచ్‌తో భయపెడుతున్న ఇంగ్లండ్

నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి..

18 నంబర్ జెర్సీ.. సిరీస్‌‌లో ఇదే హైలైట్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 19 , 2025 | 03:38 AM