Share News

మూడు రోజులు రెండు ప్రపంచ రికార్డులు

ABN , Publish Date - Jun 11 , 2025 | 01:17 AM

టీనేజ్‌ స్విమ్మర్‌, ఒలింపిక్‌ చాంపియన్‌ సమ్మర్‌ మెకింటోష్‌ సంచలన ప్రదర్శన నమో దు చేసింది. మూడ్రోజుల్లోనే రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పి...

మూడు రోజులు రెండు ప్రపంచ రికార్డులు

కెనడా స్విమ్మర్‌ మెకింటోష్‌ సంచలనం

విక్టోరియా (కెనడా): టీనేజ్‌ స్విమ్మర్‌, ఒలింపిక్‌ చాంపియన్‌ సమ్మర్‌ మెకింటోష్‌ సంచలన ప్రదర్శన నమో దు చేసింది. మూడ్రోజుల్లోనే రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పి అదరహో అనిపించింది. 18 ఏళ్ల మెకింటోష్‌... కెనడియన్‌ స్విమ్మింగ్‌ ట్రయల్స్‌లో భాగంగా శనివారం 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్‌లో 3 నిమిషాల 54.18 సెకన్లలో రేసు పూర్తి చేసి ప్రపంచరికార్డు సృష్టించింది. ఈ క్రమంలో గతంలో అరిర్నె టిట్మస్‌ (ఆస్ట్రేలియా) పేరిటనున్న 3:55.38 సెకన్ల రికార్డును తుడిచేసింది. తాజాగా సోమవారం రాత్రి జరిగిన 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే ఈవెంట్‌ను మెకింటోష్‌ 2 నిమిషాల 5.7 సెకన్లలో ఈదింది. దీంతో 2015లో కతిన్కా హోజు (హంగేరి) నెలకొల్పిన 2 నిమిషాల 6.12 సెకన్ల రికార్డు బద్దలైంది. మెకింటోష్‌ గతేడాది పారిస్‌ ఒలింపిక్స్‌లో మూడు స్వర్ణాలు, ఓ రజతం గెలిచింది.

ఇవీ చదవండి:

రింకూతో భువీ డ్యాన్స్

అమ్మకానికి ఆర్సీబీ?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 11 , 2025 | 01:17 AM