Share News

Ben Stokes Draw Denied: స్టోక్స్‌కు నో

ABN , Publish Date - Jul 28 , 2025 | 02:52 AM

ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 138వ ఓవర్‌ ముగిశాక కెప్టెన్‌ స్టోక్స్‌ డ్రా కోసం ముందుకు వచ్చాడు. అయితే జడేజా, సుందర్‌ సెంచరీకి చేరువలో ఉండడంతో దీనికి...

Ben Stokes Draw Denied: స్టోక్స్‌కు నో

ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో 138వ ఓవర్‌ ముగిశాక కెప్టెన్‌ స్టోక్స్‌ డ్రా కోసం ముందుకు వచ్చాడు. అయితే జడేజా, సుందర్‌ సెంచరీకి చేరువలో ఉండడంతో దీనికి అంగీకరించలేదు. దీంతో స్టోక్స్‌ అసంతృప్తి వ్యక్తం చేయడం కనిపించింది. అటు డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి కెప్టెన్‌ గిల్‌ చిరునవ్వుతో ఇదంతా గమనిస్తున్నా అతడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇక మ్యాచ్‌ను త్వరగా పూర్తి చేసేందుకు స్టోక్స్‌ తమ ఫీల్డర్లను సర్కిల్‌ లోపలే ఉంచాడు. దీంతో ఆ తర్వాత ఐదు ఓవర్లలోనే వేగంగా బౌండరీలు రాబట్టి జడ్డూ, సుందర్‌ తమ శతకాలను పూర్తి చేసి ఆటను ముగించారు. ఈ జోడీ ఐదో వికెట్‌కు అజేయంగా 203 పరుగులు జోడించడం విశేషం.

ఇవి కూడా చదవండి..

మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్

సెప్టెంబరు 9 నుంచి ఆసియా కప్‌

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 28 , 2025 | 02:52 AM