Syed Modi Badminton 2025: టైటిల్‌కు అడుగుదూరంలో
ABN , Publish Date - Nov 30 , 2025 | 06:06 AM
Srikanth and Gayatri Trisa Pair Advance to Syed Modi Badminton Finals
ఫైనల్లో శ్రీకాంత్, గాయత్రి జోడీ
సయ్యద్ మోదీ బ్యాడ్మింటన్ టోర్నీ
లఖ్‌నవూ: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్, డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్/ట్రీసా జాలీ జోడీ ఫైనల్స్‌కు దూసుకెళ్లారు. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో శ్రీకాంత్ 21-15, 19-21, 21-13తో భారత్‌కే చెందిన మిథున్ మంజునాథ్‌ను ఓడించాడు. మహిళల డబుల్స్ సెమీ్‌సలో గాయత్రి/ట్రీసా ద్వయం 21-11, 21-15తో మలేసియా జంట ఓంగ్ గ్జిన్ యీ/కార్మెన్ టింగ్‌పై గెలిచింది. ఉన్నతి 15-21, 10-21తో నెలిషాన్ ఆరిన్ (టర్కీ) చేతిలో, తన్వీ శర్మ 17-21, 16-21తో హినా అకెచి (జపాన్) చేతిలో ఓడారు. మిక్స్‌డ్‌లో భారత జంట ట్రీసా/హరిహరన్ 17-21, 19-21తో ఇండోనేసియా జోడీ వార్దానా/ఫెర్దినాష్యా చేతిలో పరాజయం పాలైంది. ఫైనల్స్‌లో జాసన్ గునవాన్ (హాంకాంగ్)తో శ్రీకాంత్, జపాన్ జంట ఒసావ/తనబెతో గాయత్రి జోడీ అమీతుమీ తేల్చుకోనున్నారు.
ఇవి కూడా చదవండి:
కచ్చితంగా టీమిండియాలోకి తిరిగొస్తా.. ఉమ్రాన్ మాలిక్ ఆశాభావం
పంత్‌ను చూసి నవ్వుకున్న ఫొటోగ్రాఫర్.. అసలేమైందంటే?